Jul 28,2023 23:06

టెక్కలి సబ్‌ కలెక్టర్‌ బదిలీ

ప్రజాశక్తి - టెక్కలి: టెక్కలి సబ్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై నంద్యాల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన రాహుల్‌కుమార్‌ రెడ్డి 2020 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. ఏలూరులో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2022 అక్టోబరు 16వ తేదీన టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.