ప్రజాశక్తి-జి.మాడుగుల:అంగన్వాడీ లబ్దిదారులైన గర్భిణీలు, బాలింతలకు టేక్ హౌమ్ రేషన్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో జి. మాడుగుల మండలంలో జెడ్పిటిసి వెంకట లక్ష్మి, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లి బాబు లాంచనంగా శనివారం ప్రారంభించారు. జి. మాడుగుల -1 సచివాలయ ఫరిధిలో జరిగిన సురక్ష కార్యక్రమంలో లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి, ట్రైకార్ చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎంతో ఆలోచనతో చేపట్టిన ఈ సదుపాయాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టేక్ హౌమ్ రేషన్ కింద బియ్యం, గుడ్లు, నూనెతో పాటు పప్పులు, ఇతర పౌష్టికాహారం అందిస్తున్నట్లు సిడిపిఒ సువర్ణమ్మ వివరించారు. ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేఖాదికారి, డిపిఆర్‌ఓ పి.గోవింద రాజులు, తహసిల్దార్ అప్పలస్వామి, ఎంపిడిఓ సిహెచ్ చంద్ర శేఖర్, వైస్ ఎంపిపి సత్యనారాయణ, సర్పంచ్లు కె.రాంబాబు, కొండమ్మ, ఎస్.రామక్రిష్ణ, కొండబాబు, ఎంపిటిసిలు విజయకుమారి, పాంగిలక్ష్మి, సన్యాసిదొర, పిఎసిఎస్ చైర్మన్ మత్స్యకొండ నాయుడు, జేఎస్‌ఎస్ ఇంచార్జ్ లెంకల కళ్యాణ్ పాల్గొన్నారు.










