Aug 02,2023 22:04

బలిజిపేట.. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి-బలిజిపేట : వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌ పంపిణీని చిలకలపల్లిలో బుదవారం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి అలజంగి రవికుమార్‌, ఎంపిపి గుడివాడ నాగమణి, వైస్‌ ఎంపిపి వెలిది సాయిరాం, వైసిపి మండల అధ్యక్షులు పి.మురళీకృష్ణ, సర్పంచ్‌ ఎ.సుందరరావు, ఎంపిటిసి ఎ.మల్లిక, వైసిపి సీనియర్‌ నాయకులు తప్పిట ప్రసాద్‌, పోల రామకృష్ణ, పి.నారాయణరావు, జి.శంకరరావు, ఐసిడిఎస్‌ సిడిపిఒ సిహెచ్‌ సుగుణ, సూపర్‌వైజర్‌ సంబాన సులేఖ పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక అంగన్వాడీ కేంద్రంలో బుధవారం జెడ్‌పిటిసి ఎం.బాబ్జి గర్భిణులకు, బాలింతలకు టేక్‌ హోం రేషన్‌ పంపిణీ చేశారు. 25 రోజులకు సంబంధించి రేషన్‌ పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జె.తెరీజమ్మ, ఎంపిటిసిలు గౌరి, బి.కుసుమ సూర్యనారాయణ, అంగన్వాడీ సూపర్వైజర్‌ వి.పూర్ణిమ, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : గర్భిణులు, బాలింతలకు ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు ఐసిడిఎస్‌ సెక్టార్‌ సూపర్వైజర్లు రౌతు లక్ష్మి, పి.అరుణకుమారి తెలిపారు. రావుపల్లి, రావివలస, గరుగుబిల్లి, ఉల్లిభద్ర తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం గర్భిణులు, బాలింతలకు రేషన్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు మర్రాపు సావిత్రి, పి.కృష్ణవేణి, ఆర్‌.పద్మ, ఎం.స్వాతి, పి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలో అంగన్వాడీ కేంద్రంలో ఎంపిపి బి.ఆదినారాయణ టేక్‌ హోం రేషన్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిడిపిఒ పి.రంగలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, ఉష, యశోద పాల్గొన్నారు.
సాలూరు : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ చెప్పారు. బుధవారం పట్టణంలోని 8 వార్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు వైఎస్‌ఆర్‌ పోషణ కిట్లను వైస్‌ చైర్‌పర్సన్‌ జర్జాపు దీప్తితో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ అర్బన్‌ ప్రాజెక్ట్‌ సిడిపిఒ సత్యవతి, ఎసిడిపిఒ మంగతాయారు, తదితరులు పాల్గొన్నారు.
సాలూరురూరల్‌ : శివరాంపురంలో సర్పంచ్‌ జరజాపు మోహన్‌ ఆధ్వర్యంలో టేక్‌ హోం రేషన్‌ను పంపిణీ చేశారు.