Aug 13,2023 22:05

తేజేశ్వరరావుతో మాట్లాడుతున్న వీరయ్య

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన సిఐటియు రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నాయకులు కె.వీరయ్య శ్రీకాకుళం నగరంలో నివాస ముంటున్న సిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావును పరామర్శించారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి చౌదరి సంపూర్ణమ్మను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శి:చిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఉన్నారు.