
ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయులు
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి క్లస్టర్ - 7 టేబుల్ టెన్నిస్ పోటీలలో జిల్లాలోని డాక్టర్ కె.కె.ఆర్. హాపీ వ్యాలీ స్కూల్ విద్యార్థులు పతకాలు సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ వై.రవికుమార్ తెలిపారు. ప్రతిభ కనపరిన విద్యార్థులను మంగళవారం స్కూల్ ఆవరణలో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవి కుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థులు జి.సుస్మిత, జి.హస్మిత, కె.నిఖిత, ఎం.సృజనకీర్తి, అండర్ -19 బాలికల టీమ్ విభాగంలో పతకాలు సాధించారని తెలిపారు. బాలుర విభాగంలో పి.శంకర్, ఆర్.ధనుష్, జె.సాయికృష్ణ, కె.జీతేష్ పతకాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.