నీటిని మోసుకొస్తున్న గిరిజన మహిళలు
ప్రజాశక్తి-అరకు రూరల్:మండలంలోని గన్నేల పంచాయతీ తడక గ్రామంలో మంచినీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కుళాయి మరమ్మతుకు గురైంది. అధికారులు స్పందించ లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో సుమారు 180 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. తాగునీటి కోసం కిలో మీటర్ దూరం వెళ్లి పొలంలో ఊట నీటిని సేకరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో మంచినీరు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.










