ఏటా పెరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలు
వరకట్న వేధింపులకు వివాహితలు బలి
చిన్నారులపై ఆగని అత్యాచారాలు
కాగితాలకే మహిళా చట్టాలు పరిమితం
ప్రజాశక్తి - డెస్క్
ఆమె కన్నీరు కారుస్తోంది.. తనకు రక్షణ లేదంటూ ఎక్కెక్కి ఏడుస్తోంది.. మృగాళ్ల వికృత చేష్టలు, చూపుల నడుమ ఇమడలేకుంది.. ఒకపక్క అభివృద్ధిలో అద్భుతాలు సృష్టిస్తున్నాం.. సంప్రదాయాల్లో మనమే ఆదర్శం.. ప్రగతిలో పరుగులు పెడుతున్నాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా మహిళలకు రక్షణ లేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నామంటే మన సమాజం ఎటువైపు పోతుందనేది అర్థం చేసుకోవచ్చు. మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ముక్కుపచ్చలారని పసి జీవితాలను మృగాళ్లు మొగ్గలోనే చిదిమేస్తున్నారు. మహిళల రక్షణ కోసం అంటూ ప్రభుత్వాలు చట్టాలు చేస్తూనే ఉన్నాయి. అయినా మహిళలపై వేధింపులు, హత్యలకు అడ్డుకట్ట పడడం లేదు.
జిల్లాలో రోజూ ఏదోక మూలన అఘాయిత్యాలు, మహిళల పట్ల వేధింపులు సాగుతూనే ఉన్నాయి. ఆపదలో ఉన్న అబలల కేకలు అరణ్యరోదనగా మిగిలిపోతున్నాయి.. నిర్మానుష్య ప్రాంతాలకు లాక్కెళ్లి ఆటవికంగా దాడి చేసి అంతమొందించడం పరిపాటిగా మారింది. జిల్లాలో ఈ ఏడాది కూడా చోటుచేసుకున్న ఘటనలే దీనికి నిదర్శనం. దిశ, నిర్భయ ఘటనలతో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడుతున్నారు. తాజాగా పాఠశాలలకు వెళ్తున్న బాలికలపై ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే అఘాయిత్యాలకు పాల్పడటం మరింత ఆందోళన కల్గిస్తోంది. ఈ సంవత్సరం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందుకు..
అత్యాచారాలు..
జంగారెడ్డిగూడెంలో ఐదేళ్ల చిన్నారిపై కాకి శ్రీకాంత్ అత్యాచారం చేశాడు.
మోగల్లు గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన బండారు దివ్యతేజపై పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతి ఫిర్యాదుమేరకు యువకుడిపై కేసు నమోదు చేశారు.
ఏలూరులోని కతేపువీధికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రజాక్ నగరానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకుని అత్యాచారం చేశాడు.
మండలంలోని మినిమించిలిపాడుకు చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన గొల్ల ఆనందకుమార్ అత్యాచారం చేశాడు.
ఏలూరు పరిధిలోని గ్రామానికి చెందిన బాలికపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఏలూరు నగరానికి చెందిన బాలికపై సమీపంలో ఉంటున్న రాజారత్నం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ యువతి స్నానం చేస్తున్న ఫొటోలు తీసి ఆమెను బెదిరించి వినరుకుమార్ అత్యాచారం చేశాడు.
కైకలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై శ్రీనివాస్ అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు.
శృంగవృక్షం గ్రామానికి చెందిన బాలికపై వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన నల్లి దిలీప్‌కుమార్ అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్సో కేసు నమోదైంది.
25.5:ఆచంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఆర్.అనిల్‌కుమార్ అత్యాచారం చేశాడు. అతనిపై ఫోక్సో కేసు నమోదైంది.
పెదపాడు మండలంలోని ఇంటర్ చదువుతున్న యువతిపై అదే ప్రాంతానికి చెందిన వలదాసి చక్రవర్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దెందులూరు మండలం ఓ గ్రామంలో బాలికపై అదే గ్రామానికి చెందిన ఆంతోని రాజు అతాచారానికి పాల్పడ్డాడు. బాలిక నాయనమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
టపాసులు ఇస్తామని చెప్పి మొగల్తూరు మండలంలోని ఓ బాలికపై సమీపంలో ఉంటున్న ఆకన శ్రీను అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామానికి చెందిన దళిత మహిళపై అదే ప్రాంతానికి చెందిన వైసిపి నాయకుడు దత్తాడ అబ్రహం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యలు..
్యఏలూరు నగరంలోని కానిస్టేబుల్ సంసుద్దీన్ భార్య రాదియా బసిరి భార్యా భర్తల మధ్య గొడవల నేపథ్యంలో మనస్తాపం చెంది ఉరేసుకుని మృతి చెందింది.
్యయువకుల వేధింపులు తాళలేక ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
్యతణుకులోని ఆపిల్ ఆసుపత్రికి అనుబంధంగాఉన్న నర్సింగ్ కళాశాలలో చదువుతున్న పూళ్ల గ్రామానికి చెందిన ఎం.షారోనుకుమారి ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకుంది.
్య భర్త, అత్తమామల వేధింపులు తాళలేక కొయ్యలగూడెం అశోక్‌నగర్‌కు చెందిన వివాహిత (వాలంటీర్) ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.
్యపురుగులు మందు తాగి వివాహిత కాతిన నాగమ్మ ఆత్మహత్య చేసుకుంది.
్యభర్త రాఖేష్ వేధింపులు తాళలేక పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ శౌరీపురానికి చెందిన పొన్నా తనూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
్య భర్త లక్ష్మీపతితో జరిగిన గొడవ కారణంగా జంగారెడ్డిగూడెంలోని డాంగేనగర్‌కు చెందిన వివాహిత రమాదేవి ఒంటిపై టిన్నర్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దోషులకు శిక్ష పడటమే లక్ష్యంగా ముందుకు
రాహుల్‌దేవ్‌శర్మ, ఏలూరు జిల్లా ఎస్‌పి
మహిళలపై అఘాయిత్యాలకు, దాడులకు పాల్పడే దోషులకు కఠిన శిక్ష పడటమే లక్ష్యంగా మా శాఖ ముందుకు సాగుతుంది. దిశా యాప్‌ను మహిళలు విస్తృతంగా వినియోగించేలా ప్రత్యేక కేంద్రీకరణతో ముందుకు సాగుతున్నాం. తద్వారా దిశా చట్టం ఫలితాలు బాధిత మహిళలకు దక్కేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధిత మహిళ నుంచి సమాచారం అందగానే మూడు నుంచి ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడం, నేరస్తులు తప్పించుకోకుండా శిక్ష పడేలా చూడటమే మా ధ్యేయం.
వేధింపులు..
్యవేలేరుపాడు మండలంలోని వసంతవాడ గ్రామానికి చెందిన ఎం.సింగరాజు అదే ప్రాంతానికి చెందిన గిరిజన యువతిని వేధించడంతో అతనిపై ఫొక్సో కేసు నమోదైంది.
్యఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన చిన్నారిపై సమీప బంధువు వాలంటీర్ మున్నుల శ్రావన్‌కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుపై అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
్యఏలూరు టూటౌన్ ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేశారు.
్యఉండి గ్రామానికి చెందిన వితంతువు స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన యాదాల జాన్‌వెస్లీ, అతని స్నేహితుడు జార్జి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి బెదిరింపులకు పాలపడ్డారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు వారిద్దరిపై కేసు నమోదైంది.
్యఆగిరిపల్లి మండలం వడ్లమానులో బాలికపై లైంగిక వేధింపులకు ప్పాడిన ముగ్గురు బాలురుపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
్యతణుకు మండలం పైడిపర్రుకు చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన కూరపాటి దిలీప్‌కుమార్ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడికి ఐదేళ్లు జైలు శిక్ష పడింది.
్యఅదనపు కట్నం కోసం నిడమర్రు మండలం మందలపర్రు గ్రామాని చెందిన బంగ లక్ష్మిని భర్త బంగ నాని, అత్తమామలు వేధింపులకు గురిచేయడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరం.. శిక్ష..
1.ఉద్దేశపూర్వకంగా వేధించినా, అవమానించినా: ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష
2.అసభ్యకరంగా ప్రవర్తిస్తే : రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జైలు
3.బాలికపై అత్యాచారం. :7 నుంచి 10 సంవత్సరాలు
4.దౌర్జన్యం చేస్తే : మూడు సంవత్సరాలు జైలు శిక్ష
5.వ్యక్తిగత ఫొటోలు తీస్తే : 3 నుంచి 7 సంవత్సరాలు
6.లైంగికంగా వేధిస్తూ డిమాండ్ చేస్తే : ఒక సంవత్సరం శిక్ష
7.యాసిడ్, ఇతర దాడులు చేస్తే : 3 నుంచి 7 సంవత్సరాలు జైలు
8.వెంటపడి వేధిస్తే : 3 నుంచి ఏడేళుల జైలు
హత్యలు..
ఉండ్రాజవరం మండలం మర్రిపాలెంకు చెందిన అక్కిన అప్పమ్మను భర్త సుందరావ్రు గొంతు కోసి హతమార్చాడు.
గణపవరం మండలం చినరామచంద్రాపురానికి చెందిన చిగురుకోట శ్రీను భార్య జ్యోతిపై అనుమానంతో కత్తితో గొంతు కోసి హత మార్చాడు.
అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన కాళ్ల మండలం పల్లెపాలెంకు చెందిన యువతి చిప్పాల కళ్యాణి హత్యకు గురైంది.
తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన విప్పర్తి దైవ వరప్రసాద్ కోడలు మాలతిపై దాడి చేశాడు.
కేసు ఉపసంహరించుకోకపోతే అంతు చూస్తానంటూ భార్య ధనలక్ష్మిపై, ఆమె తల్లిపై రాంబాబు దాడి చేశాడు.
అనుమానంతో భీమవరం చక్కావారివీధికి చెందిన వివాహితపై భర్త రమేష్ బ్లేడుతో దాడి చేశాడు.
ఆస్తి కోసం రోకలి బండతో నాయనమ్మను కొట్టిన మనవడు వంశీ. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు జయమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది.
ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంలో వడాలికి చెందిన వివాహిత త్రివేణిని భర్త శివశంకర్ గొంతు నులిమి హత్య చేశాడు.










