Nov 14,2022 23:56

మాట్లాడుతున్న డిఎల్‌పిఒ కుమార్‌

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: క్లాప్‌ మిత్ర సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని డిఎల్‌పిఒ పిఎస్‌ కుమార్‌ సూచించారు. మండలంలోని కిండంగి, మినుములూరు ఎస్‌డబ్ల్యూపిసి షెడ్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. గుత్తులపుట్టు సంత వద్ద ఉన్న చెత్తను ప్రోక్లైనర్‌తో తొలగించి కాలువల పూడిక తీయాలని సెక్రటరీ మత్స్యరాజు, సత్యనారాయణను ఆదేశించారు. మంచినీటి ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్‌ చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని సూచించారు.