సంగివలసలో తడి, పొడి, ప్రమాదకర చెత్త విభజనపై అవగాహన కల్పి స్తున్న జెడ్సీ రాము
ప్రజాశక్తి -తగరపువలస : తడి, పొడి, ప్రమాదకర చెత్త విభజనపై జివిఎంసి రెండో వార్డు పరిధి సంగివలసలో మహిళలకు గురువారం జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము అవగాహన కల్పించారు. ఇంటి ముంగిటకు వచ్చే క్లాప్ వాహనాలకు తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుసిడి ఎపిడి ఎల్.రాము, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.మహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
కాల్వల్లో పూడిక తొలగింపు
సంగివలస కాలనీలో పేరుకుపోయిన పూడికను పారిశుధ్య కార్మికులు గురువారం తొలగించారు. జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము ప్రత్యక్ష పర్యవేక్షణలో పూడిక తీత కార్యక్రమం జరిగింది.










