ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:క్లాప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అబీద్ సెంటర్ కూడలిలో తడి పొడి చెత్తపై అవగాహన ర్యాలీ శనివారం చేపట్టారు. తడి పొడి చెత్త సేకరణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు చెత్తను విచ్చలవిడిగా వీధుల్లో వేయడంతో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ, మహిళలు ఇంట్లోనే చెత్తను నిల్వ చేసుకొని చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే అందులో వేయాలన్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వేయవద్దని తెలిపారు. చెత్త వేయడంతో రోగాల బారిన పాడిన పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగా ఉండాలన్నారు. ఇళ్ళల్లో చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి మహిళలు సహకరించి వాహనాల దగ్గరికి వచ్చి చెత్త వేయాలన్నారు. శానిటేషన్ కార్యక్రమంపై శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టి బాబు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కనకారావు, వైసీపీ నాయకులు గొలుసు నరసింహమూర్తి, ఆరుగొల్లు రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.










