Dec 30,2022 16:21

ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: ప్రతి నిరుపేద విద్యార్థికి సాంకేతిక విద్యను ఆందించి ఒక ఇంజినీరుగానో, డాక్టరు గానో చదువుకోవడంతోనే ఆ కుటుంబం బాగుపడుతుందన్న దృడసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నగొట్టిగల్లులో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుండి సాంకేతిక విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం దేశంలో ఎక్కడ లేని విధంగా బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ను మొత్తంగా 32 వేల రు.లతో విలువతో ఉచితంగా సీఎం జగనన్న అందించారన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు వేసి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచి జగనన్న ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులను కోరారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువున్న 184 మంది విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో ఎంపిపి బాలం యుగందర్ రెడ్డి, డిసిఎమ్మెస్ మాజి చైర్మన్ సామకోటి సహదేవరెడ్డి, జట్పీటిసి కె. స్వరూప,ఎంపిడిఓ దేవేంద్ర బాబు,ఎంఈఓ యం.సత్యనారాయణ, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.