Apr 06,2023 21:44

ప్రజాశక్తి - ఉంగుటూరు
                నారాయణపురం టైల్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో గురువారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆవరణలో ఓ మూల గోనెసంచులు, చెత్త చెదారం, జీడి పిక్కల వ్యర్థాలు తదితర వస్తువులు అగ్ని ప్రమాదానికి గురై మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే ఫ్యాక్టరీ అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. తొలుత మంటలను చూసిన చేబ్రోలు, నారాయణపురం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.