Nov 13,2023 22:31

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుంచి టైలరింగ్‌లో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ తాడి. శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యువతులకు మాత్రమేనని, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు మధ్య వారికి మాత్రమే ఈ శిక్షణ ఉంటుందన్నారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగి కనీసం 7వ తరగతి చదివి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో పూర్తిగా ఉచిత భోజనం వసతి కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం 7780599939, 8555988580 నెంబర్లను సంప్రదించాలని కోరారు.