Oct 04,2022 22:52

పతకాలు సాధించిన విద్యార్థులు

ప్రజాశక్తి -మధురవాడ : రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో మధురవాడకు చెందిన క్రీడాకారులు 15 పతకాలు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు యూత్‌ తైక్వాండో సంస్థ కోచ్‌ పి.సురేష్‌ తెలిపారు. క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.అచ్యుతరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.అచ్చంనాయుడు, యూత్‌ తైక్వాండో ప్రధాన కార్యదర్శి ఎం.సురేష్‌ అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, నెల్లూరులో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు జరిగిన నాలుగవ ఏపీ కప్‌ తైక్వాండో పోటీల్లో 4 బంగారు, 5 రజత, 6 కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. సబ్‌ జూనియర్‌ బాల బాలికల విభాగంలో గాయత్రి, బాషిత, నిత్యశ్రీ, జస్వంత్‌ సాయి సూర్య బంగారు పతకాలు, సబ్‌ జూనియర్‌ క్యాడెట్‌ విభాగంలో హర్ష వర్ధన్‌, పి.జస్వంత్‌, ధనలక్ష్మి, మణికంఠ హిమాన్షు, ఆదిత్య రజత పతకాలు, సబ్‌ జూనియర్‌/ కేడెట్‌ విభాగంలో గౌరీయోచన, దుర్గా సాయి శ్రీనివాస్‌, జ్ఞాన సిరి, సాయి ప్రతాప్‌, మహేష్‌, వికేక్‌ అభిక్‌ కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. కోచ్‌ సుకుమార్‌ సంపత్‌, టీమ్‌ మేనేజర్‌ పి.సురేష్‌ను క్రీడాకారుల తల్లిదండ్రులు అభినందించారు.