May 05,2023 10:41

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను ప్రారంభిస్తున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జిఎస్‌టి ఆఫీసర్‌ డి.శ్యామలమ్మ, శ్రీ ఉమా మాధవ స్కూల్‌ కరస్పాండెంట్‌ బి.మాధవ్‌ కృష్ణ



తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ ప్రారంభం
ప్రజాశక్తి - కర్నూలు స్పోర్ట్స్‌

         కర్నూలు నగరంలోని సంతోష్‌ నగర్‌ ప్రాంతంలో ఉన్న శ్రీ ఉమా మాధవ స్కూల్లో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో తైక్వాండో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జిఎస్‌టి ఆఫీసర్‌ డి.శ్యామలమ్మ, పాఠశాల కరస్పాండెంట్‌ బి.మాధవ్‌ కృష్ణ హాజరై సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జిఎస్‌టి ఆఫీసర్‌ డి.శ్యామలమ్మ మాట్లాడారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపును సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. వేసవి సెలవులలో విద్యార్థులకు, చిన్న పిల్లలకు ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్‌ బి.మాధవ్‌ కృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు నేటి నుండి శ్రీ ఉమా మాధవ స్కూల్లో జరుగుతున్న ఈ క్యాంప్‌లో తైక్వాండో క్రీడాకారిణి, క్యాంప్‌ ఇన్‌ఛార్జి లలిత కీర్తన శిక్షణ ఇస్తారని తెలిపారు. విద్యార్థులు, ఆసక్తి కలిగిన చిన్న పిల్లలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం శిక్షణ తరగతుల ఇన్‌ఛార్జి లలిత కీర్తనను అభినందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్‌ జి.షబ్బీర్‌ హుస్సేన్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జిఎస్‌టి ఆఫీసర్‌ డి.శ్యామలమ్మకు బొకే అందజేస్తున్న విద్యార్థిని
కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జిఎస్‌టి ఆఫీసర్‌ డి.శ్యామలమ్మకు బొకే అందజేస్తున్న విద్యార్థిని