Aug 30,2023 16:22

విజేతలను అభినందిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, నారాయణ విద్యాసంస్థల ఎజిఎం రమేష్‌

తైక్వాండో పోటీల్లో నారాయణ విద్యార్థుల ప్రతిభ
విజేతలకు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, నారాయణ విద్యాసంస్థల ఎజిఎం రమేష్‌ అభినందన
ప్రజాశకి - కర్నూలు స్పోర్ట్స్‌

       ఈ నెల 26, 27వ తేదీలలో బెంగళూరులో జరిగిన వెస్టర్స్‌ కప్‌ మొదటి జాతీయ ఓపెన్‌ టైక్వాండో ఛాంపియన్షిప్‌ పోటీలలో కర్నూల్‌ నగరానికి చెందిన నారాయణ విద్యార్థులు బంగారు పతకాలను సాధించారు. బుధవారం కర్నూలు ఎమ్మెల్యే కార్యాలయంలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, నారాయణ విద్యాసంస్థల ఎజిఎం రమేష్‌ కుమార్‌లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు గోల్డ్‌ మెడల్‌ సాధించడం అభినందనీయమని అన్నారు. గొప్ప విజయాలను సాధించిన నారాయణ విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. పతకాలు సాధించిన వారిలో 10వ తరగతి విద్యార్థిని ఎంజి.ఇందిరా ప్రియదర్శిని, 9వ తరగతి విద్యార్థి డి.మహమ్మద్‌ షహల్‌ అష్రఫ్‌లు గోల్డ్‌ మెడల్‌, 7వ తరగతి విద్యార్థి వై.హర్షవర్ధన్‌ సిల్వర్‌ మెడల్‌, 5వ తరగతి విద్యార్థి మహమ్మద్‌ అద్నాన్‌లు గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌ శ్రీనివాసరెడ్డి, దినేష్‌ కుమార్‌, అజీజ్‌, టైక్వాండో శిక్షకులు జి.షబ్బీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.