Nov 24,2022 23:59

పోటీలకు ఎంపికైన చోడవరం విద్యార్థులు

ప్రజాశక్తి- చోడవరం
ఈ నెల 25, 26, 27 తేదీల్లో నంద్యాలలోని రామకృష్ణ పీజీ కాలేజ్‌ ఇండోర్‌ స్టేడియంలో జరగనున్న 2వ ఓపెన్‌ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 35 మంది విద్యార్థులు ఎంపికైనట్లు టైక్వాండో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్‌, జిల్లా ఉపాధ్యక్షులు పల్లం మురళీకృష్ణ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలకు చోడవరంకు చెందిన వి.జెసిక రోజిలి, ఎం.సంతోష్‌లక్ష్మి, ఎం.హేమశ్రీ, ఆర్‌.దీక్షిత, వి.లిఖిత, బి.సత్య రామచంద్ర, ఎన్‌.విష్ణువర్ధన్‌, జి.నాగ సాయిరామ్‌, జివి.శశివర్ధన్‌, వి.సాయి దశ్వంత్‌, పిఎస్‌ఎస్‌.తరుణ్‌, ఎస్‌.తనహ, వి.ఇసిత శారద, ఎ.చంటిబాబు, కె.రోహీత్‌, జికె సందీప్‌ ఉన్నట్లు చెప్పారు. దూలం రమేష్‌, శేఖర్‌, ఎం.సంతోషి లక్ష్మి టిమ్‌ కోచ్‌లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు తైక్వాండో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు టి.హర్ష వర్థన్‌ ప్రసాద్‌, జిల్లా ప్రతినిధులు పి.గణేష్‌ కుమార్‌, చవల చంద్రశేఖర్‌, షేక్‌ ఆలీ, కె.ప్రదీప్‌ అభినందనలు తెలిపారు.