ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 8వ తేదీ నుంచి జరగనున్న జాతీయ స్థాయి సీనియర్ తైక్వాండో పోటీలకు జిల్లా జట్టు ఎంపికైనట్టు తైక్వాండో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగే ఈ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలు మొత్తం ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. వీరంతా గత ఫిబ్రవరిలో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారని అన్నారు. జట్టులోని క్రీడాకారులకు రాష్ట్ర కార్యదర్శి పి.అచ్యుతరెడ్డి, జిల్లా కార్యదర్శి కె.పద్మనాభం, జిల్లా అధ్యక్షులు మధుసూదనరావు, డిఎస్‌సి చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్, నేషనల్ రిఫరీలు సత్యనారాయణ, త్రిమూర్తులు, తదితరులు అభినందించారు.










