Jul 21,2023 23:50

గ్రామస్తులతో మాట్లాడుతున్న నాయకులు

పజాశక్తి-బాపట్ల రూరల్‌ : టైగర్‌ నాగేశ్వరరావు చిత్రాన్ని నిలిపి వేయాలని సిపిఎం బందం డిమాండ్‌ చేసింది. బాపట్ల మండలం సూవర్టు పురం గ్రామానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు పేరుతో తీస్తున్న సినిమాను గ్రామస్తులు వ్యతి రేస్తున్నారు. అందులో భాగంగా సిపిఎం బృందం ఆ గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌. గంగయ్య మాట్లాడుతూ సూవర్టుపురం గ్రామ ప్రజలను నేరస్తులుగా చూపిస్తూ చిత్రీకరించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా విడుదలను నిలిపి వేయాలన్నారు. హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన చుక్క పాల్‌ రాజు, గ్రామపెద్దలను కలిసి చట్టపరంగా వారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు టి. కృష్ణమోహన్‌, నూతలపాటి కోటేశ్వరరావు, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.