Sep 29,2023 22:30

షాపును ప్రారంభిస్తున్న హీరోయిన్‌ బిందుమాధవి

తాటిబెల్లం కాఫీ కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన నెలై తాటిబెల్లం కాఫీ కేంద్రాన్ని ప్రముఖ సినీ హీరోయిన్‌ బిందుమాధవి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక తిరుపతి-కరకంబాడి రోడ్డులోని గంగరామ్‌ కళ్యాణమండపం పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన నెలై తాటిబెల్లం కాపీ కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఇనరు సుల్తాన్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసిన హీరోయిన్‌ బిందుమాదవి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మన ప్రాచీన సాంప్రదాయ రుచులతో నెలై తాటిబెల్లం కాపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అబినందనీయమన్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్న ఈ కేంద్రంలోని పదార్ధాలను తిరుపతి వాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాటిబెల్లం కాపీ కేంద్రం నిర్వహకులు మనోజ్‌, ప్రశాంత్‌ మాట్లాడుతూ తిరుపతి-తిరుచానూరు రోడ్డులో నెలై తాటిబెల్లం కాపీని ప్రారంభించిన అతి తక్కువ సమయంలో ఎంతో ప్రాచుర్యం చెంది ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచిందన్నారు. తిరుపతి వాసులకు మరింత చేరువుగా నెలై తాటిబెల్లం కాపీ 2వ బ్రాంచిని ఏర్పాటు చేశామన్నారు. ఇది సౌత్‌ ఇండియాలోనే 100వ బ్రాంచ్‌ అని తెలిపారు. ఇక్కడ తాటిబెల్లం హాల్వా, తాటిబెల్లం ఐస్‌క్రీమ్‌, తాటిబెల్లం జ్యూస్‌, అరటిపువ్వు వడ, సాంప్రదాయ చిరుధాన్యాల అల్పాహారం. నాటు చక్కెరతో చేసిన మైసుర్‌పాక్‌, పనసపండు నెయ్యి, జామకాయ నెయ్యి, పైనాఫిల్‌ నెయ్యి, బీట్‌రూట్‌, ఖర్జూరం, క్యారెట్‌ నెయ్యితో చేసిన మైసూర్‌పాక్‌, బెల్లం బాధుషా, బెల్లం కొర్రెల బిస్కెట్‌, బెల్లం రాగి, బెల్లం సజ్జల బిస్కెట్‌ తదితర సాంప్రదాయ ఆహార పదార్ధాలు లబిస్తాయన్నారు. ప్రారంభం సందర్బంగా బెల్లం కాపీ ఒకటి కొంటే మరోక్కొటి ఉచితంగా అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుపతి మేయర్‌ డాక్టరు శిరీషా, డిప్యూటీ మేయర్లు భూమన అభినరురెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌, మల్లెమొగ్గల ఉమాపతి పాల్గొన్నారు.
షాపును ప్రారంభిస్తున్న హీరోయిన్‌ బిందుమాధవి