Feb 19,2023 23:53
తారకరత్నకు నివాళి అర్పిస్తున్న టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు మనవడు, సినీ హీరో నందమూరి తారకరత్న గత 23 రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురై శనివారం రాత్రి మృతి చెందటం చాలా బాధాకరమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తారకరత్న చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య మాట్లాడుతూ తారకరత్న మృతి చెందటం తెలుగుదేశం పార్టీ అభిమానులను, నాయకులను, సినీ అభిమానులను శోకసముద్రంలో ముంచివేసింది అన్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఉన్నా నేనున్నాను అంటూ తాను ముందుకు వచ్చి ప్రతి చోట సంఘీభావం తెలిపి కార్యక్రమాల్లో పాల్గొనే తారకరత్న మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజవల్లి శ్రీనివాసరావు, గంజి పురుషోత్తం, కౌతరపు జనార్ధనరావు, కొండ్రు రత్నబాబు, షేక్‌ మొహిద్దిన్‌, కూరపాటి పూర్ణ, దుడ్డు శామ్యూల్‌, కోటి మోహన్‌కృష్ణ నరాల తిరుపతి రాయుడు, పలగర్ల మస్తాన్‌రావు, బూదాటి నాగేశ్వరరావు, పులిపాటి శేఖర్‌, కుంచాల రామాంజనేయులు, బోయిన శ్రీనివాసరావు, షేక్‌ రబ్బాని, గుంటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.