Oct 24,2023 22:10

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
             స్థానిక జగనన్న కాలనీలో తారకరామ కన్‌స్ట్రక్షన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పళ్ల ఏసుబాబు ఆధ్వర్యంలో దసరా వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ప్రత్యేకంగా వాహన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా పళ్ల ఏసుబాబు తనయుడు పళ్ల తారక రామ నంద సాయి అయ్యప్ప తారకరామ కన్‌స్ట్రక్షన్స్‌ వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వైస్‌ ఛైర్మన్‌ తారకరామ మాట్లాడుతూ తన తండ్రి ఏసుబాబు సూచన మేరకు తారకరామ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వీలైనంత త్వరగా ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. వైస్‌ ఛైర్మన్‌ను సన్నిహితులు, కుటుంబసభ్యులు, స్నేహితులు అభినందించారు. ఏసుబాబు మాట్లాడుతూ ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ తనకు అప్పగించిన పేదల ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. ప్రతి ఇంటిని పూర్తి చేసి వారికి అందించాలనే తపనతో నాటి నుంచి నిరంతరం నిర్మాణాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల లబ్ధిదారులు ఎప్పటికప్పుడు తమ ఇంటి నిర్మాణాలను స్వయంగా చూసుకోవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.