ప్రజాశక్తి-పాడేరు టౌన్: ప్రముఖ సినీనటుడు నంద మూరి తారకరత్న మృతికి స్థానిక టిడిపి నాయకులు ఆదివారం ఘనంగా నివాలర్పించారు. తారకరత్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, రాష్ట్ర గిరిజన సహకార సం మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, టిడిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, కొయ్యూరు మండల మాజీ జడ్‌పిటిసి సభ్యులు శ్రీరామ్మూర్తి, ఉల్లి రామారావు, బేరా సత్యనారాయణ, బాకూరు బాలరాజు పాల్గొన్నారు.
చింతూరు: సినీనటుడు నందమూరి తారకరత్నకు మృతికి సంతాపంగా చింతూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యాలయంలో తారకరత్న చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అస్వస్థతకు గురై ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం బాధాకరమన్నారు. తారకరత్న మరణం పార్టీకి, అభిమానులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇల్లా చిన్నరెడ్డి, వెంకటేశ్వరరావు, ముత్యాల శ్రీరామ్, రామారావు, సురేష్ చౌదరి, ముత్తయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు.










