ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : పేరుకే ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం. పగటి పూట మాత్రమే మెరుగైన వైద్యం. రాత్రివేళ అయితే అంధకారమే. విద్యుత్ సరఫరా ఉంటే తప్ప ఇక్కడ విద్యుత్ దీపాలు వెలగన పరిస్థితి. వేళాపాలా అన్న తేడా లేకుండా విద్యుత్ కోతలు ఉండడంతో ఒక్కొక్క సమయంలో చీకటిలోనే రోగులకు వైద్యం అందాల్సిన పరిస్థితి. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా లేకపోవడంతో చిన్నపిల్లల వార్డులో టార్చ్ లైట్ల వెలుగు మధ్య వైద్యులు వైద్యం అందించిన సంఘటన వెలుగు చూసింది. భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గల చిన్నపిల్లల చికిత్స విభాగంలో మంగళవారం రాత్రి విద్యుత్ కోత కారణంగా జనరేటర్ పనిచేయక పోవడంతో చిన్నపిల్లలకు వైద్య సహాయం అందించడానికి డాక్టర్లు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి 7 గంటలకు పుష్పాపను తీసుకువచ్చి వైద్య సహాయం కోసం వచ్చారు కరెంటు లేని కారణంగా జనరేటర్ పనిచేయని కారణంగా సెల్ ఫోన్ లైట్ లలో పుష్పాకు చికిత్స అందించారు.










