Apr 10,2023 01:41
సాయమందిస్తున్న ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు

ప్రజాశక్తి-బాపట్ల: తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలపాలైన భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి ఫ్రెండ్స్‌ ఆదర్శ యూత్‌ ఆర్గనైజేషన్‌ తోడుగా నిలిచింది. పట్టణంలోని ఉమ్మారెడ్డి సరోజినీదేవి కాలనీకి చెందిన శ్రీపతి అయ్యప్ప తాపీ పని చేసే సమయంలో పరంజాపై నుంచి కిందపడి కాలి ఎముక విరిగి తీవ్రగాయాలపాలై గత నెల రోజులుగా పనికి వెళ్లలేని స్థితిలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో బాధిత కుటుంబానికి తమ ఆర్గనైజేషన్‌ ద్వారా రూ.5 వేలు ఆర్థిక సహాయం అందజేసినట్లు ఫ్రెండ్స్‌ ఆదర్శ యూత్‌ ఆర్గనైజే షన్‌ గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు తెలిపారు. దాతలు ముందుకొచ్చి బాధితుడిని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్బారావు, ట్రెజరర్‌ సువర్ణరాజు, సభ్యులు నరాలశెట్టి నాగరాజు, విన్నకోట శ్రీనివాసరావు, భీమా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.