Nov 28,2022 23:06

ప్రజాశక్తి - ఏలూరు
              తుది శ్వాస విడిచే వరకు సిపిఎం కార్యకర్తగా పని చేసిన తాన్న రంగారావు ధన్యజీవి అని సిపిఎం జిల్లా నాయకులు బి.సోమయ్య అన్నారు. సిపిఎం నేత తాన్న రంగారావు సంస్మరణ సభ ఆ పార్టీ నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షతన చోడిదిబ్బలో సోమవారం జరిగింది. సభలో సోమయ్య మాట్లాడుతూ రంగారావు ఈ ప్రాంతంలో సిపిఎం నాయకునిగా చురుగ్గా పని చేశారన్నారు. ఆయన ప్రజా ఉద్యమంలో పని చేయడమే కాకుండా భార్య సింహాచలంను కూడా ప్రోత్సహించి మహిళా సంఘం నేతగా ప్రోత్సహించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో రౌడీల చేతుల్లో రంగారావు భార్య సింహాచలం వీర మరణం పొందారని గుర్తు చేశారు. రంగారావు నిబద్దత, క్రమశిక్షణను నేటి తరం కార్యకర్తలు అలవర్చుకోవాలన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు కంది విశ్వనాథం మాట్లాడుతూ రంగారావు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రతిసారీ సమాజంలో పరిస్థితులను అడిగి తెలుసుకునే వారన్నారు. మహిళా సంఘం నాయకురాలు వెంకటలక్ష్మి, చోడిదిబ్బ గ్రంథాలయం నిర్వాహకులు సింహాచలం, చిన్న కుమారుడు భూషణం తదితరులు మాట్లాడారు. ఈ సభలో సిపిఎం నగర నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, పి.ఆదిశేషు, ఎం.ఇస్సాక్‌, జె.గోపీ, జి.యేసుబాబు, ఐ.దుర్గారావు, జి.కోటేశ్వరరావు, చల్లా పైడయ్య, గౌడ రవి, మీసాల సత్యం, స్థానిక పెద్దలు అల్లం వెంకటేశ్వరరావు, శేఖరు, రంగారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.