Jul 11,2023 22:52

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన తానా 23వ మహాసభల్లో సిరివెన్నెల గేయాలపై జరిగిన సదస్సులో నగరానికి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు. సిరివెన్నెల రాసిన మనసు పాటలపై డాక్టర్‌ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగిస్తూ తెలుగు సినిమాలలో ఆత్రేయ తరువాత ఎక్కువగా మనసు పాటలు రాసింది సిరివెన్నెల అని వివరించారు. ఆత్రేయ పాటల్లో వేదన, విరహం, భగ ప్రేమ, వేదాంత దోరణి కనిపిస్తే, సిరివెన్నెల పాటల్లో ఆశావహ దృక్పథం, పట్టుదల, కష్టాలను ఎలా ఎదుర్కోవాలన్న సానుకూల దోరణి ఎక్కువగా కనపడుతుందన్నారు. తోటకూర ప్రసాద్‌ అధ్యక్షత వహించిన ఈసదస్సులో సిరివెన్నుల కుటుంబ సభ్యులతో పాటు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, కిరణ్‌ ప్రభ, జీడిగుంట విజయసారధి, కొండా వెంకట్‌,చిగురుమళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు.