ప్రజాశక్తి-గొలుగొండ:సాలికమల్లవరం సమీపంలో గల తాండవ జలాశయంలో 4 లక్షల 20 వేల చేప పిల్లలను జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మత్స్యశాఖ అధికారి ఆశాజ్యోతి మాట్లాడుతూ, గతంలో జలాశయంలో 5.20లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందని, ఈసారి మరో రూ.4.20లక్షల పిల్లలను విడుదల చేశామన్నారు. అనంతరం నలుగురు మత్స్యకారులకు సబ్సిడిపై మోటార్ సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైస్ ఎంపిపి జక్కు నాగమణి, వైసిపి యువజన విభాగం అధ్యక్షులు మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, తాండవ స్వదేశి మత్స్యకార సంఘం చైర్మన్ నక్కా రమణ, సాలికమల్లవరం సర్పంచ్ పెదిరెడ్ల నూకరత్నం, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి పత్తి రమణ, పంచాయతీ కార్యదర్శి స్వామి, వైసిపి ప్రధాన కార్యదర్శి అప్పలస్వామినాయుడు, మత్స్యకారులు పాల్గొన్నారు.










