Aug 25,2023 22:25

ప్రజాశక్తి - పెనుగొండ
           మండలంలోని తామరాడలో విషజ్వరాలు సోకి పలువురు అనారోగ్య పాలు కావడంతో అధికారులు గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ సుగుణరాజు గ్రామంలో పర్యటించి ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామంలో పూర్తిగా సున్నా కేసులు వచ్చేవరకు ఆరోగ్య శిబిరాలు కొనసాగాలని, ఎప్పటికప్పుడు ప్రతి ఇంటిని సర్వే చేసి తమకు సమాచారం అందించాలని తెలిపారు. స్థానికులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య మెరుగుదలకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ఇంటి బయట ఆవరణలోనే కాకుండా ఇళ్లలో కూడా దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి పావని, ఎంపిహెచ్‌ఒ బృందేశ్వరరావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.