Oct 24,2023 23:28

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి - తాళ్లరేవు
తాళ్లరేవు సంతపేట సెంటర్లో టిడిపి ఆధ్వర్యంలో సైకో పోవాలి, సైకిల్‌ రావాలి అంటూ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి బాబి మాట్లాడారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాట్ల సుబ్బరాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ నినదించారు. సైకో పోవాలి అని రాసి ఉన్న ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్టా త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబు, మోపూరి వెంకటేశ్వరరావు, జక్కల ప్రసాద్‌బాబు, కంచర్ల లక్ష్మోజి, జిల్లా నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, టి. లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ట్రాఫిక్‌ కు అంతరాయం కలగగా కోరంగి ఎస్‌ఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు.