May 17,2023 22:24

ప్రమాద ఘటన స్థలంలో సీతారాంపురం వైపు ఏర్పాటు చేసిన స్పీడ్‌ బ్రేకర్‌

ప్రజాశక్తి - తాళ్లరేవు
జాతీయ రహదారి 216 పై తాళ్లరేవులో ఈనెల 14వ తేదీ ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మతిచెందడంతో అధికారులు అప్రమత్త మయ్యారు. నేషనల్‌ హైవే అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన స్పీడ్‌ బ్రేకర్స్‌ ఏర్పాటు చేశారు.జాతీయ రహదారి నుంచి గ్రామీణ ప్రాంత రహదారులకు అనుసంధానంగా ఉన్న కోరంగి పంచాయతీ ఘటన ప్రాంతంలో చిన్న బొడ్డు వెంకటరాయపాలెం, సీతారామపురం వెళ్లే రహదారులకు బ్రేకర్లు నిర్మించారు. అదేవిధంగా చొల్లంగి, జి.వేమవరం, పటవల, పోలేకురు, తాళ్ళరేవు రహదారులకు స్పీడ్‌ బ్రేకర్లను నిర్మించారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.