బోల్తా పడిన ట్రాక్టర్
ప్రజాశక్తి-సీతంపేట : మండలంలో రూపాయి గ్రామానికి చెందిన భాస్కరరావు (65) శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రూపాయి గ్రామ సమీపంలో పొలంలో దమ్ము పడుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించాడు. భాస్కరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.










