Oct 17,2022 23:41

మాట్లాడుతున్న భాస్కర్‌

ప్రజాశక్తి - మారేడుమిల్లి
ఆంధ్రలో టాక్సీ యూనియన్ల బలోపేతానికి కృషి చేస్తునట్లు మన ఆంధ్ర -మన టాక్సీ అసోసియేషన్‌ అధ్యక్షులు కస్తూరి భాస్కర్‌ తెలిపారు. సోమవారం మారేడుమిల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో ఈ అసోసియేషన్‌ విస్తరించిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని టాక్సీ యూనియన్లు ఒకే తాటిపైకి రావాలని, అందు కోసం తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యూనియన్లకు ఎటువంటి ఆపద సంభవించినా మన ఆంధ్ర మన టాక్సీ అసోసియేషన్‌ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు రవీంద్రనాధ్‌ రెడ్డి (కడప), ప్రధాన కార్యదర్శి దాసరి మురళి (తెనాలి), సంయుక్త కార్యదర్శి సుందరశెట్టి ఫణి, కోశాధికారి ఎంట ప్రగాఢ మధు, కార్యవర్గ సభ్యులు గుడపర్తి నాని, ది మారేడుమిల్లి క్యాబ్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆనంద్‌ ఇన్నా, సత్యనారాయణరెడ్డి ట్రావెల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సునీల్‌ కిషోర్‌ రెడ్డి, యూనియన్‌ నాయకులు, వాహన యజమానులు పాల్గొన్నారు.