Apr 11,2023 17:33

తాహసీల్దార్ కార్యాలయం ముందు అలసిపోయి క్రింద కూర్చున్న మహిళలు.
 రెవిన్యూ ఇన్స్పెక్టర్ చాంబర్ ముందు క్యూ కట్టిన ప్రజలు.
 రెవిన్యూ ఇన్స్పెక్టర్ చాంబర్ ముందు క్యూ కట్టిన ప్రజలు.
 

 

తాహసీల్దార్ కార్యాలయం ముందు నిరీక్షించి... నీరసించి...
- అధికారుల కోసం ఎదురు ప్రజలచూపులు...
- కంప్యూటర్ ఆపరేటర్లు ఒకరుంటే ఒకరుండరు..
- ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కొరకు ప్రజల పాట్లు..
- ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కనీస సౌకర్యాలు కరువు..
ప్రజాశక్తి - నంద్యాల రూరల్

   కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఏదో ఒక పధకం ప్రవేశపెట్టిన ప్పుడల్లా  ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలకొరకు ప్రజలకు పాట్లు తప్పడం లేదు ఇటీవల కేంద్రంప్రభత్వం మిషన్ వాత్స్యల్య పథకం ప్రవేశపెట్టింది. ఈ వాత్సల్య పథకం నిరాధారణ కు గురైన అర్హులైన బాలబాలికలు ఈ నెల 15 వ తారీకు లోగా దరఖాస్తు చేసుకోవాలని శిశు సంక్షేమ శాఖ వారు ప్రకటన జారీ చేశారు ఈ మేరకు ఈ పథకానికి అవసరంఅయినా ఆదాయా కుల ధ్రువీకరణ పత్రాల కొరకు నంద్యాల మండలంలోని తహసిల్దార్ కార్యాలయానికి ప్రజలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది.కాని మంగళవారం కార్యాలయం లో తాహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లేకపోవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు, నంద్యాల తాసీల్దార్ వెలుగోడు కు కూడా ఇంచార్జ్ కావడంతో ఆయన వెలుగోడు కు వెళ్లడం జరిగిందని కార్యాలయం    సిబ్బంది చెబుతున్నారన్నారు. మిషన్ వాత్సల్య పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాడానికి సమయం కేవలం నాలుగు రోజులే ఉండటంతో అధికారులు అందుబాటులో లేకపోవడం తో ప్రజలు అధికారుల కొరకు ఎదురు చూసి కార్యాలయం ముందు నిరీక్షించి నీరసించి పో యారు.కార్యాలయం లో కంప్యూటర్ ఆపరేటర్ ఒకరుంటే ఒకరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం కుల ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కంప్యూటర్ లో నమోదు చెయ్యడం జరిగింది, ఆదాయ పత్రాలు మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ లేక పెండింగ్ లో ఉండి పోయాయి. మంగళవారం అధికారులు లేక కుల ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లో పడుతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. ఇదే అదునుగా కార్యాలయం లోని సిబ్బంది కొంతమంది తమ చేతి వాటం చూపిస్తున్నారని ప్రజలు చర్చించు కుంటున్నారు.
సంబంధం లేని వ్యక్తి కార్యాలయం లో పెత్తనం
     కార్యాలయంకు సంబంధం లేని ఓ వ్యక్తి కార్యాలయం లో పెత్తనం చేలాయిస్తున్నాడు అని అతడు కనీసం తలారీ కూడా కాదని, అతను నేను మీ పని చేసి పెడతాను అని  ప్రజల దగ్గర డబ్బులు వసూల్ చేస్తున్నాడు అని, అతడు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు కట్టలు కట్టలు తీసుకెళ్లిన మాట్లాడకుండా అధికారులు సంతకాలు చేస్తున్నారు అని, కంప్యూటర్ ఆపరేటర్లు కూడా అతను తెచ్చిన దరఖాస్తులు క్షణల్లో ఓ కే చేసేస్తారు అని, సామాన్య ప్రజల దరఖాస్తులు మాత్రం అక్కడ పెట్టేసి వెళ్ళండి పది రోజుల తరువాత రండి అని చెప్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంతకి ఆ వ్యక్తికీ అధికారులకు ఎ రకమైన సంబంధం ఉందో.. అని, అతని ద్వారా కొంతమంది అధికారులు ఆర్థిక లావాదేవీలు ఏమైనా సాగిస్తున్నారా? అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తి కార్యాలయంలో పెత్తనం ఏమిటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తాహసీల్దార్ కార్యాలయం దగ్గర కనీస సౌకర్యాలు కరువు తాహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో సబ్ రిజిస్టర్, ట్రెజరరీ, రూరల్ పోలీస్ స్టేషన్ లాంటిప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, కాబట్టి ప్రజలు ఏదో ఒక పని మీద వేల సంఖ్యలో కార్యాలయాలకు వస్తుంటారు కానిప్రజలకు కనీసా సౌకర్యాలు కరువాయ్యాయి అని నంద్యాల పేరుకే జిల్లా కాని ప్రభుత్వ కార్యాలయాలఅభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉంది. ఎండలు మండుతున్నాయి గొంతు తడుపుకోవాడానికి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర గుక్కెడు నీళ్లు దొరకక, కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంతకు ముందు చెట్ల క్రింద కూర్చోడానికి అరుగులు ఉండేవి వాటిని తొలగించి ప్రజలు కూర్చోడానికి మెరుగైన వసతులు కల్పిస్తాము అని ఇసుక కంకర తెప్పించారు కాని వాటితో ఏ పనులు చెయ్యకుండా అలాగే వదిలేసారు.దానితో తాహసీల్దార్, ట్రెజరరీ కార్యాలయంముందు ఉన్నా ఇసుక, కంకర తో కార్యాలయాలకువచ్చే ప్రజలు వాహనాలు పెట్టుకోవాడానికి స్థలము లేక ఎండలు తీవ్రంగా ఉండటంతో కూర్చోడానికి వసతిలేక , నీడ లేక  ఇబ్బందులకు గురుతున్నామనిప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాహసీల్దార్ కార్యాలయం కు వచ్చే ప్రజలకు త్రాగు నీరు, నీడ, కూర్చోడానికి వసతులు కల్పించాలని ప్రజలు కోరుకో టున్నారు.