May 02,2023 19:39

ఉపాధి పనులను తనిఖీ చేస్తున్న ఎపిఒ

ప్రజాశక్తి - హాలహర్వి
ఉపాధి కూలీలు విధిగా తాగునీరు తెచ్చుకోవాలని ఎపిఒ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మండలంలోని మేదేహాల్‌ గ్రామంలో ఉపాధి హామీ చట్టంలో భాగంగా జరుగుతున్న పనులను ఎపిఒ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. పని ప్రదేశంలో పని చేసే వారి పేర్లను మస్టర్లలో హాజరు వేసేలా మేటీలు చూడాలని ఆయన తెలిపారు. వేసవికాలం నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు ఉదయం 6 గంటలకే పనిలోకి వచ్చి, 10.30 గంటలకు పని చేసుకుని వెళ్లాలని సూచించారు. కూలీలు పాల్గొన్నారు.