Aug 28,2023 00:09

ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లి పట్టణంలోని మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం నుంచి కొండ చుట్టూ తిరిగి కార్యాలయం వరకు మున్సిపల్‌ ట్యాపుల నుంచి మురికినీరు వస్తోంది. పంపు తిప్పగానే రెండు మూడు బకెట్లు నురగతో కూడిన మురుగునీరు వస్తుడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సిఎం నివాసానికి కూత వేటు దూరంలో ఈ పరిస్థితి తలెత్తడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కపక్క మెయిన్‌ రోడ్డు వెంట గత నెల రోజుల నుంచి పైపులైన్‌ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అంతకు ముందు కూడా ఇలాగే మురుగునీరు వచ్చాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని మురుగునీటిని అరికట్టి మంచినీరు వచ్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాశక్తి - నాదెండ్ల : మండల కేంద్రమైన నాదెండ్లలో నాలుగు రోజులుగా తాగునీరు ఆకుపచ్చ రంగులో వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక బరోడా బ్యాంక్‌ ప్రాంతంలో ఈ నీరు ఇలా వస్తున్నాయని, అధికారులను అడిగినా సరైన సమాధానం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.