Jul 02,2023 00:10

సమస్యలు తెలుసుకుంటున్న బూడి

ప్రజాశక్తి-మాడుగుల:ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఎం.కృష్ణాపురం, విజే.పురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న బూడి మాట్లాడుతూ, తాగు నీటి సమస్య లేకుండా ఇంటింటికీ మంచి నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌ అప్పారావు,. ఎంపిపి పెదబాబు, వైస్‌ ఎంపిపి లు రాజారామ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు
కోటవురట్ల:అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంలో అధికారులు అప్రమ త్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు సూచించారు. శనివారం రాజుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గ్రామంలో కాలనీ ఇల్లు, పింఛన్లు మంజూరుకు ఎమ్మెల్యే వద్ద మొర పెట్టుకున్నారు. గ్రామంలో ప్రధాన రహదారి అద్వానంగా ఉన్న విషయం ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం చౌడువాడ గ్రామంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు, మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ, తహసిల్దార్‌ జానకమ్మ పర్యటించి జగనన్న సురక్షలో భాగంగా ధృవపత్రాలు అందజేశారు, కోటవురట్ల సచివాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌, స్థానిక ఎంపీటీసీ పి.సూర్యారావు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, పలు శాఖల అధికారులు, పలువురు సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.