Jul 04,2023 00:25

నీటిని మోసుకొస్తున్న మహిళలు

ప్రజాశక్తి-రావికమతం:మండలంలో తట్టబంధ పంచాయతీ శివారు పొర్లుపాలెం గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామానికి చెందిన వెంగళ రామలక్ష్మి, కొండపల్లి లక్ష్మి, వెంగళ దేవి, మురిపిండి చిన్న తల్లి, ఈశ్వరరావు, యజ్జి శ్రీను, వెంగళ నాగమణి కోరారు. ఈ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు ఉండగా బుక్కెడు మంచినీరు కూడా దొరకక అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మూడు మంచినీటి బోర్లు ఉండగా ఉప్పునీరు కావడంతో తాగడానికి వీలు పడలేదు. మంచి నీరు కావాలంటే గ్రామస్తులు కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఎల్‌ఎన్‌ పురం గ్రామానికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ గోకవాడ రమణను వివరణ కోరగా... పంచాయతీలో నిధులు లేనందున మంచినీటి సౌకర్యం కల్పించలేక పోతున్నామని తెలిపారు.