ప్రజాశక్తి-రామచంద్రపురం
మండలంలోని ద్రాక్షారామలో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్ నిధులతో నిర్మించే 2లక్షల లీటర్ల సామర్థ్యంగల రక్షిత మంచినీటి ట్యాంకును రూ.1.60లక్షలతో నిర్మిస్తారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు మెర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపిపి అంబటి భవాని, సర్పంచ్ కొత్తపల్లి అరుణ, వెలంపాలెం ఎంపిటిసి సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, వైసిపి నాయకులు నరాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు










