చెరువును సందర్శిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - పెద్దకడబూరు
తాగునీటిని సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని సిపిఐ నాయకులు కోరారు. సోమవారం మండలంలోని నైలేకల్ దగ్గర ఉన్న తాగునీటి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడారు. మండలంలోని గ్రామాలకు ఈ చెరువు నుంచి తాగునీరు వెళ్తోందని తెలిపారు. ఫిల్టర్ కావడం లేదని, ఈ నీరు తాగితే ప్రజలు అనారోగ్యం బారిన పడతారని చెప్పారు. తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాజు, కుమ్మరి చంద్ర, తిక్కన్న, మేకడోన గిడ్డయ్య, రామాంజనేయులు పాల్గొన్నారు.










