ప్రజాశక్తి-కంచికచర్ల
ప్రజలకు స్వచ్చమైన తాగునీటి సరఫరాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయల ఖర్చు చేస్తోందని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద కృష్ణానది ఒడ్డున గల తాగునీటి సరఫరా పంపింగ్ స్కీం వద్ద ఫిల్టర్ బెడ్ మరమ్మతులు, రాక్ శాండ్, గుంటూరు జిల్లా అమరావతి వైపు గల పాయ నుండి చెవిటికల్లు వరకు నదిలో నీటిపాయ మళ్ళించే సప్లరు ఛానల్ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామీణ నీటి సరఫరా పధకం నిధులు 10 లక్లల రూపాయలతో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్ణానది నీటిని మోటార్లు ద్వారా సంప్ లోకి నింపి, సంప్లోనీటిని శుద్ది చేసి కంచికచర్ల, వీరులపాడు మండలాల్లోని పలు గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. రానున్న వేసవిని దష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా నీటిని మళ్ళించే పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, చెవిటికల్లు, కునికినపాడు సర్పంచ్ లు బుడ్డి విజయలక్ష్మి, బండారుపల్లి సత్యం, మాజీ ఎంపిపి పాటిబండ్ల హరి, వైస్ ఎంపిపి వెలగలేటి మాధవి పాల్గొన్నారు.










