Nov 02,2023 22:18

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   పట్టణంలో తాగునీటి సరఫరా సమృద్ధిగా అందించడానికి కృషి చేస్తున్నామని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. గురువారం స్థానిక మున్సిపాలిటీ 27వ వార్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన పబ్లిక్‌ కుళాయిలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి అనేక మంది తాగు నీటిని వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని గుర్తించి సుమారు రూ.లక్షతో 5 కుళాయిలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సెలర్‌ నేట్రు సుబ్బలక్ష్మి, అయినాల వెంకటరమణమూర్తి, వైస్‌ ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, కమీషనర్‌ భవాని ప్రసాద్‌, ఎఇ సంధ్య, నేకూరి కిషోర్‌, దొంతు మాధవ్‌, పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.