పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణంలో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మత్తులు ఉంటే పూర్తి చేసి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రావిపాడు సమీపంలో గల శాంతినగర్ లోని నరసరావుపేట పురపాలక సంఘ సంబంధించిన తాగునీటి సరఫరా కేంద్రాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంక్ ల ద్వారా సరఫరా అయ్యే నీరు చివరి గహాల వారికి సక్రమంగా సరఫరా కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని అటువంటి ప్రాంతాలకు ట్యాంకర్ల నీటి సరఫరా చేసి సమస్య పరిష్కారానికి కషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా మంచి నీటి చెరువు నుండి పట్టణంలోకి నీరు సరఫరా అయ్యే పైప్ లైన్ ల మరమ్మతులు ఎప్పటికప్పుడు త్వరితగతిన చేపట్టి నీటి సరఫరాకు అంతరాయం కలిగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.










