గెడ్డలో నీటిని తోడుతున్న మహిళలలు
ప్రజాశక్తి- ముంచింగి పుట్టు:మండల కేంద్రంలోని 12వ వార్డు రామాలయం వీధి లో తాగునీటి సమస్య నెలకొందని కించాయిపుట్టు వైస్ సర్పంచ్ పెనుమాల సరోజినీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బోరు బావి మరమ్మత్తులకు గురవ్వగా పైపులు తీసి వాటిని అమర్చడం మరిచి కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు కనీసం స్పందించ లేదన్నారు.
సుజనకోట పంచాయతీ కుమ్మరి పుట్టు గ్రామంలో తాగునీరు లేక జోలాపూట్టు రిజర్వాయర్ గెడ్డలో కలుషితమైన నీటిని వినియోగించాల్సిన పరిస్థితి నెలకోంది. ఏనుగురై పంచాయతీలో తాగునీటి సమస్య నెలకొంది. తాగునీటి భావి మరమ్మత్తులకు గురైంది.అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని ఆయా గ్రామాల గిరిజనులు కోరారు.










