వినతిపత్రం అందజేస్తున్న నేతలు
ప్రజాశక్తి- డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో మంచి నీటి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి సూర్యనారాయణ మండల పరిషత్ అభివద్ధి అధికారిని ఉషారాణికు వినతి పత్రం అందజేశారు. అడపవలస గ్రామంలో గత వారం రోజులుగా బోరు మరమ్మతుకు గురికావడంతో గ్రామ గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో గ్రామంలో చేతిపంపు బోరు నుంచి బురద నీరు రావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాగర పంచాయతీ సెక్రెటరీ వలిభా, గిరిజన సంఘం నాయకులు వి.సింహచలం, వి.ఆనంద్ పాల్గొన్నారు.










