Jun 20,2023 23:34

పథకాలపై ప్రచారం చేపడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-కోటవురట్ల:తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంగళవారం సుంకపూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు స్థానికులు మొరపెట్టుకున్నారు. ప్రధానంగా ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యపై ్ల స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. తమ రేషన్‌ కార్డులు తొలగించడంతో పథకాలు నిలిచి పోయాయని గ్రామస్తులు తెలిపారు.గ్రామంలో చెరువు స్థలంలో నిర్మితమవుతున్న వెల్నెస్‌ సెంటర్‌ వివరాలు రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో అధికారులతో సమావేశమై సంక్షేమ పథకాలు అందించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశి విశ్వనాథరావు, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, డిప్యూటీ తహసిల్దార్‌ సోమశేఖర్‌, గ్రామ సర్పంచ్‌ చిటికెల కాశీ లక్ష్మి, వైసిపి మండల అధ్యక్షులు కిల్లాడ శ్రీనివాసరావు నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.