Oct 06,2023 23:36

నాగులపాడులో చెరువును పరిశీలిస్తూ గ్రామస్తుల సూచనలు వింటున్న జెసి రాజకుమారి

పెదనందిపాడు: మండలంలోని పెదనందిపాడు, నాగులపాడు గ్రామాలలో తాగునీటి, వాడుకనీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి అన్నారు. శుక్రవారం పెదనందిపాడు, నాగులపాడు గ్రామాల్లోని మంచినీటి చెరువులను, ఫిల్టర్‌ బెడ్‌ లను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెదనంది పాడులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్య క్రమంలో భాగంగా గ్రామస్తులు నీటి సమస్య గురించి తమ దృష్టికి తీసుకువచ్చారని, ఆ సమస్యను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంచినీటి చెరువులు, ఫిల్టర్‌ బెడ్‌ను పరిశీలించే నిమిత్తం పెదనందిపాడుకు వచ్చినట్లు చెప్పారు. గ్రామ స్తులు కొన్ని సూచనలు చేశారని వాటిని పరిశీలించి త్వర లో పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, డిఎల్పిఓ లక్ష్మణరావు పెదనంది పాడు తహ శీల్దార్‌ షేక్‌ మహబూబ్‌ సుభాని, ఈవోపీఆర్డీ ఎన్‌ సాయి లీల, పంచాయతి కార్యదర్శి జి.నాగయ్య, పాల్గొన్నారు.