
తాగునీటి సమస్యను పరష్కరించాలి
ప్రజాశక్తి-కావలి : కొనదిన్నె గిరిజన కాలనీలో గిరిజనులకు తాగునీటి సమస్యను పరిష్కరించాలని టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు మున్సిపల్ అధికారులను కోరారు. శనివారం కావలి పట్టణ 6వ వార్డు కొనదిన్నె గిరిజన కాలనీలో మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ''బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికసంఖ్యలో చేరుకున్న టిడిపి శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరిగి చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ప్రచారం చేశారు. ప్రజలతో మాట్లాడి బాబు భవిష్యత్తుకు గ్యారెంటీలో పేర్కొన్న అంశాలను తెలియజేస్తూ... రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ప్రజలకు సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఆదాయాన్ని తెలియజేస్తూ, బాండు రూపంలో వారికి అందించారు. అనంతరం అక్కడి ప్రజలతో ''రచ్చబండ'' కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో నీటి సమస్యపై ప్రజలు అయన దృష్టికి తీసుకురావడంతో అక్కడినుండే మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వారంలోగా తాగునీటి పరిష్కారం కాకపోతే మున్సిపల్ ఆఫీసుకు కాలనీ వాసులు తరలి రావాల్సి వస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు కత్తి సుధాకర్, ఇండ్ల మల్లికార్జున, కళ్యాణ్, చలంచర్ల సీనయ్య, సాంబయ్య, భాను ప్రసాద్, మల్లవరపు బుజ్జమ్మ, పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.