May 17,2023 00:02

వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం, జనసేన ప్రజాప్రతినిధులు

అధికారులకు సిపిఎం, జనసేన ప్రజాప్రతినిధుల వినతి
ప్రజాశక్తి-కూనవరం

మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సిపిఎం, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా మంగళవారం ఎంపిడిఒ, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇలకు వినతిపత్రాలు అందజేశారు. మండలంలోని రేగులపాడు, లింగాపురం, కూటూరు, చూచిరేవుల గూడెం గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామాల్లో ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీలు కొమరం పెంటయ్య, సాంబశివ, ఎంపిటిసిలు అమ్మాజీ, జయసుధ, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, కర్నాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.