ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు
ప్రజాశక్తి కొత్తచెరువు : కొత్తచెరువు లోని కుమ్మర కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు కాలనీ వద్ద ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. 15 రోజులుగా పంచాయతీ వారు కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయలేదని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని మహిళలు వాపోయారు. నీరు రానందున ట్యాంకర్లకు డబ్బులు కట్టి తెప్పించుకుంటున్నామన్నారు. సత్యసాయి నీరు గాని, చేతిపంపులు గాని లేనందున ట్యాంకర్ ద్వారా సరఫరా చేసుకుంటున్నామని తెలిపారు. పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ మహిళలు కోరారు










